చలో తాడేపల్లి ఎఫెక్ట్: జేసీ తనయుు అరెస్ట్

by  |
చలో తాడేపల్లి ఎఫెక్ట్: జేసీ తనయుు అరెస్ట్
X

దిశ, ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లాలో టీడీపీ యువనేత జేసీ పవన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం తాడిపత్రిలోని తన నివాసంలో జాబ్ క్యాలెండర్ పేరుతో ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని పవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు జేసీ పవన్ రెడ్డిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఇకపోతే జాబ్ క్యాలెండర్‌ను సవరించాలని కోరుతూ ఏపీలో విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు కొన్నిరోజులుగా నిరసనలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం చలో తాడేపల్లికి పిలుపునిచ్చాయి. సీఎం జగన్ హౌస్ ముట్టడి నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు.



Next Story

Most Viewed