అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు లేదా..?: చంద్రబాబు

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-03-07 09:09:17  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రాలకి వెళ్లి పాచి పనులు చేసుకోవడానికి మీరు రెడి గా ఉన్నారు కానీ ..అమరావతిని కాపాడుకోవడానికి రెడీగా లేరా అంటూ నిలదీశారు. పట్టిసీమ నాకోసం కట్టనా..? నీళ్లు తాగేవాళ్లకు అర్థం కాలేదా..? తెలుగువాడి పౌరుషం ఏమైంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అని నిలదీశారు. పవిత్రమైన కనకదుర్గమ్మ [&hellip;]</p>

Chandrababu Naidu
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రాలకి వెళ్లి పాచి పనులు చేసుకోవడానికి మీరు రెడి గా ఉన్నారు కానీ ..అమరావతిని కాపాడుకోవడానికి రెడీగా లేరా అంటూ నిలదీశారు. పట్టిసీమ నాకోసం కట్టనా..? నీళ్లు తాగేవాళ్లకు అర్థం కాలేదా..? తెలుగువాడి పౌరుషం ఏమైంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అని నిలదీశారు. పవిత్రమైన కనకదుర్గమ్మ చెంత ఉండి మంత్రి ఎంత అవినీతికి పాల్పడుతున్నాడో మీకు తెలియదా అని నిలదీశారు. దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు ఏమైనట్లు అని నిలదీశారు. కొబ్బరి చిప్పలు అమ్ముకునే మంత్రి అవినీతి తప్ప అభివృద్ధి ఏమైనా చేశాడా అంటూ నిలదీశారు. పోండి వాడు ఓటుకి రెండు వేలు ఇస్తాడు తీసుకొని ఓట్లు వెయ్యండి ..ఆ తర్వాత ఇబ్బందులు పడండి అంటూ చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.

Next Story