అదో మోసపూరిత పథకం: అయ్యన్న పాత్రుడు

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-11-22 01:42:40  IST  )

<p>దిశ, విశాఖపట్నం: వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం మోస పూరితమైనదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్న పాత్రుడు అన్నారు. ఆ పథకం పేరుతో, ప్రకటనల ముసుగులో రైతులను జగన్ దారుణంగా మోసగిస్తున్నారని తెలిపారు. రూ.లక్ష, అంతలోపు రుణం తీసుకొని, సకాలంలో చెల్లించినవారికే సున్నావడ్డీ అమలవుతుందని షరతు పెట్టారని తెలిపారు. దీనివల్ల కేవలం 20నుంచి 30శాతం మంది రైతులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందన్నారు. అధికారంలోకి రాక ముందు జగన్ అనేక అబద్దాలు చెప్పారనీ, సీఎం అయ్యాక కూడా [&hellip;]</p>

అదో మోసపూరిత పథకం: అయ్యన్న పాత్రుడు
X

దిశ, విశాఖపట్నం: వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం మోస పూరితమైనదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్న పాత్రుడు అన్నారు. ఆ పథకం పేరుతో, ప్రకటనల ముసుగులో రైతులను జగన్ దారుణంగా మోసగిస్తున్నారని తెలిపారు. రూ.లక్ష, అంతలోపు రుణం తీసుకొని, సకాలంలో చెల్లించినవారికే సున్నావడ్డీ అమలవుతుందని షరతు పెట్టారని తెలిపారు. దీనివల్ల కేవలం 20నుంచి 30శాతం మంది రైతులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందన్నారు.

అధికారంలోకి రాక ముందు జగన్ అనేక అబద్దాలు చెప్పారనీ, సీఎం అయ్యాక కూడా జగన్ ఆ మోసాలనే కొనసాగిస్తున్నారని తెలిపారు. విశాఖ భూముల దోపిడీ ఇప్పడు గ్రామీణ ప్రాంతాలకు చేరిందన్నారు. పోలవరం ఉత్తరాంధ్రుల కల అని అన్నారు. పోలవరం ఎత్తును తగ్గించడానికి, పెంచడానికి మీరెవరని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. మాటతప్పను, మడమ తిప్పనూ అని చెబతూనే అనేక సార్లు సీఎం జగన్ మాటతప్పి, మడమతిప్పాడని అన్నారు. ఆ విషయం పై ఆయన ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు.

Next Story