- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలా చేస్తే రూ.10 వేలు మీకే.. టీడీపీ వినూత్న ఆఫర్
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రతిపక్ష టీడీపీ ప్రజలకు ఇచ్చిన ఒక ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. త్వరలో జరగనున్న తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికను పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించి జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అధికార వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి పోటీ చేస్తుండగా.. టీడీపీ నుంచి మాజీ కేంద్రమంత్రి వనబా లక్ష్మీ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి రత్నప్రభ బరిలోకి దిగుతుండగా.. ప్రధాన పోటీ మాత్రం అధికార, […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రతిపక్ష టీడీపీ ప్రజలకు ఇచ్చిన ఒక ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. త్వరలో జరగనున్న తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికను పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించి జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అధికార వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి పోటీ చేస్తుండగా.. టీడీపీ నుంచి మాజీ కేంద్రమంత్రి వనబా లక్ష్మీ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి రత్నప్రభ బరిలోకి దిగుతుండగా.. ప్రధాన పోటీ మాత్రం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్యే ఉంది.
ఎన్నికల్లో గెలుపు దిశగా టీడీపీ, వైసీపీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ ఇచ్చిన ఒక వినూత్న ఆఫర్ చర్చనీయాంశంగా మారింది. వైసీపీకి ఓటేయకపోతే పథకాలు రావంటూ ఓటర్లను ఎవరైనా బెదిరిస్తే.. వీడియో తీసి 75575 54444 వాట్సప్ నెంబర్‌కి పంపించాలని కోరింది. ఇలా పంపిస్తే.. ఏకంగా రూ.10 వేలు ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది.
వైసీపీకి ఓటెయ్యకపోతే పథకాలు రావంటూ తిరుపతి ఉపఎన్నికల్లో ఓటర్లను బెదిరించే వాలంటీర్ల ఫోటోలు, వీడియోలు తీసి 75575 54444 నంబరుకు పంపించి రూ.10,000లు అందుకోండి అంటూ తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు @katchannaidu పిలుపునిచ్చారు. pic.twitter.com/qK8ybOWHfj
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) March 30, 2021
ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరిట సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనను టీడీపీ తన అధికారిక ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్లలో పోస్ట్ చేసింది. దీనిని బట్టి చూస్తే.. తిరుపతి ఉపఎన్నికలను టీడీపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతుంది.






