- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్.రమణ రాజీనామాతో టీడీపీకి నష్టమేమీ లేదు
<p>దిశ, కోదాడ: నాయకులు రాజీనామా చేసినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి జరిగే నష్టం ఏమీలేదని టీడీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నంబూరి సూర్యం అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని పార్టీ ఆఫీసులో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వెంటనే నూతన అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేసేందుకు కార్యకర్తలు నూతన ఉత్తేజంతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఏడేండ్ల నుంచి […]</p>

దిశ, కోదాడ: నాయకులు రాజీనామా చేసినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి జరిగే నష్టం ఏమీలేదని టీడీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నంబూరి సూర్యం అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని పార్టీ ఆఫీసులో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వెంటనే నూతన అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేసేందుకు కార్యకర్తలు నూతన ఉత్తేజంతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఏడేండ్ల నుంచి చంద్రబాబు నాయుడు ఒక బీసీ వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం చేసి అవకాశం ఇస్తే.. ఎల్.రమణ ఈరోజు పార్టీ మారారని, అయినా పార్టీకి ఏమాత్రం నష్టం లేదని అన్నారు. ఈ సమావేశంలో ఉన్నం హనుమంతరావు, ఉప్పగండ్ల శ్రీనివాసరావు, కార్యదర్శి శ్రీను, శంకర్, దుర్గారావు, భావన, సత్యం పాల్గొన్నారు.






