- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలి : యరపతినేని
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావు చేసిన కామెంట్స్‌పై ఏపీ సీఎం జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు సూచించారు. రూ.4 వేల కోట్లకు ఆశపడి విద్యుత్ మీటర్లతో రైతుల మెడకు ఉచ్చు బిగిస్తున్నారని విమర్శించారు. రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. సంక్షేమ రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. సొంత లిక్కర్ పాలసీ తెచ్చి పిచ్చి బ్రాండ్లను ప్రజలకు అంటగట్టారని యరపతినేని శ్రీనివాసరావు ఘాటు వ్యాఖ్యలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావు చేసిన కామెంట్స్‌పై ఏపీ సీఎం జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు సూచించారు. రూ.4 వేల కోట్లకు ఆశపడి విద్యుత్ మీటర్లతో రైతుల మెడకు ఉచ్చు బిగిస్తున్నారని విమర్శించారు. రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు.
సంక్షేమ రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. సొంత లిక్కర్ పాలసీ తెచ్చి పిచ్చి బ్రాండ్లను ప్రజలకు అంటగట్టారని యరపతినేని శ్రీనివాసరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలాఉండగా, కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులను రాజ్యసభలో టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించగా, వైసీపీ పార్టీ స్వాగతించిన విషయం తెలిసిందే.
Next Story






