- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గవర్నర్ ఆమోదంపై యనమల ఫైర్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ ఆమోదం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఓ వైపు వైసీపీ నేతలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే.. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులపై గవర్నర్ ఆమోదం ఏంటని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అనుమానం వ్యక్తం చేశారు. సీఆర్‌డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఎలా ఆమోదం తెలుపుతారని ప్రశ్నించారు. దీనిపై అటార్నీ జనరల్ అభిప్రాయం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ ఆమోదం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఓ వైపు వైసీపీ నేతలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే.. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులపై గవర్నర్ ఆమోదం ఏంటని మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అనుమానం వ్యక్తం చేశారు. సీఆర్‌డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఎలా ఆమోదం తెలుపుతారని ప్రశ్నించారు. దీనిపై అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని గుర్తు చేసిన యనమల.. ఈ బిల్లులను ఆయన వద్దకు ఎందుకు పంపలేదో సమాధానం చెప్పాలన్నారు. బిల్లులు కోర్టులోనే ఉన్నాయని ఏజీ చెప్పిన గవర్నర్ దగ్గరకు ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. చట్ట విరుద్ధంగా ఈ బిల్లులకు ఆమోదం తెలిపినట్టు యనమల ఆరోపించారు.
Next Story






