- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి ప్రెస్‌మీట్ పెడితే కోర్టుకెళ్తా: వర్ల రామయ్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని అంతా తాను ఒక్కడినే నడిపిస్తున్నట్లు సజ్జల ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. సజ్జల మరోసారి ప్రెస్‌మీట్ పెడితే హైకోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న సజ్జల రాష్ట్రంలో జరిగే సకల విషయాలపై ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. మరోసారి సజ్జల మీడియా ముందుకొచ్చి ప్రభుత్వానికి సంబంధించిన విషయాలపై మాట్లాడితే సజ్జలే సీఎం […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని అంతా తాను ఒక్కడినే నడిపిస్తున్నట్లు సజ్జల ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. సజ్జల మరోసారి ప్రెస్‌మీట్ పెడితే హైకోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న సజ్జల రాష్ట్రంలో జరిగే సకల విషయాలపై ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. మరోసారి సజ్జల మీడియా ముందుకొచ్చి ప్రభుత్వానికి సంబంధించిన విషయాలపై మాట్లాడితే సజ్జలే సీఎం అని రాష్ట్రమంతా తిరిగి చెబుతానని వెల్లడించారు. సీఎంగా జగన్ ఉండి ఏం లాభమని అన్నారు. సీఎంకు అవగాహన లేదని అందుకే సజ్జల మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు ఒప్పుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
Next Story






