- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీలో చేరిన టీడీపీ నేత శిద్దా రాఘవరావు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీలో మరో కీలకమైన వికెట్ పడిపోయింది. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు టీడీపీకి గుడ్ బై చెప్పి, వైఎస్సార్సీపీలో చేరారు. బుధవారం వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ సమక్షంలో తన కుమారుడు సుధీర్‌తో కలిసి చేరారు. వీరిద్దరినీ పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్, వెల్లంపల్లి […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీలో మరో కీలకమైన వికెట్ పడిపోయింది. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు టీడీపీకి గుడ్ బై చెప్పి, వైఎస్సార్సీపీలో చేరారు. బుధవారం వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ సమక్షంలో తన కుమారుడు సుధీర్‌తో కలిసి చేరారు. వీరిద్దరినీ పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరానని అన్నారు. ఏడాది కాలంగా జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, భవిష్యత్తులో కూడా అమలు చేస్తారని అన్నారు. ప్రజల మనసుల్లో జగన్ చెరగని ముద్ర వేసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు.
Next Story






