- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయసాయిరెడ్డి వైసీపీలోనే ఉంటావా?: బుద్ధా
<p>దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న జాలి పడ్డారు. ట్విట్టర్ మాధ్యమంగా విజయసాయిరెడ్డిని ప్రశ్నలడుగుతూ.. బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం, తమ పార్టీ అధ్యక్షుడు జగన్ తనను పక్కన పెట్టారంటూ దుష్ప్రచారం జరుగుతోందన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై బుద్దా స్పందిస్తూ, ‘విశాఖలో విజయసాయి ప్రెస్‌మీట్ చూసిన తరువాత అతనిపై జాలేస్తుంది. విజయసాయి కాస్తా విఫలసాయిలా పేలవంగా మాట్లాడుతున్నారు. ఆయన ప్రెస్ మీట్ చూసిన తరువాత నాకు కొన్ని అనుమానాలు […]</p>

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న జాలి పడ్డారు. ట్విట్టర్ మాధ్యమంగా విజయసాయిరెడ్డిని ప్రశ్నలడుగుతూ.. బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం, తమ పార్టీ అధ్యక్షుడు జగన్ తనను పక్కన పెట్టారంటూ దుష్ప్రచారం జరుగుతోందన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై బుద్దా స్పందిస్తూ, ‘విశాఖలో విజయసాయి ప్రెస్‌మీట్ చూసిన తరువాత అతనిపై జాలేస్తుంది. విజయసాయి కాస్తా విఫలసాయిలా పేలవంగా మాట్లాడుతున్నారు. ఆయన ప్రెస్ మీట్ చూసిన తరువాత నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి? ఇంతకీ విజయసాయిరెడ్డిని వైఎస్సార్సీపీలోనే ఉంటావా అని అడిగింది ఎవరు?’ అని ప్రశ్నించారు.
‘ఎవరూ అడగకుండానే ఆయన చచ్చేవరకూ వైఎస్సార్సీపీలోనే ఉంటా అనడానికి కారణం ఏంటీ? పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరు వల్లనే ఆయన బయటకు వచ్చి ఈ రకమైన స్టేట్‌మెంట్లు ఇస్తున్నారా? అనే అనుమానం కలుగుతుంది. కారులోంచి దించేసిన తరువాత విజయసాయి ప్రవర్తనలో ఎంతో మార్పు కనపడుతుంది. పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయి. ఒకప్పుడు ఢిల్లీ మొత్తం నాదే, విశాఖలో చీమ చిటుక్కుమన్నా దాని వెనుక నేనే ఉన్నాను అన్న విజయసాయి ఇప్పుడు కేవలం సోషల్ మీడియా వ్యవహారాలు మాత్రమే చూస్తానని చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది’ అని ప్రశ్నించారు.






