- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే పోరాటమే, వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ నేత హెచ్చరిక

దిశ, ఏపీ బ్యూరో: అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లాలోని తెనాలి మార్కెట్ యార్డ్ వద్ద మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆందోళనకు దిగారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అధికారులు నిరాకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీస స్పందించకపోవడం విచారకరమన్నారు.
రైతులకు నష్ట పరిహారం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వంద శాతం న్యాయం చేయాలని ఆలపాటి రాజా డిమాండ్ చేశారు. పంట ఎంత నష్టపోతే అంత నష్టపరిహారం వెంటనే చెల్లించాలన్నారు. రైతుల నుంచి ఆఖరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే రైతులతో కలిసి పోరాటానికి సిద్ధమవుతామని మాజీమంత్రి ఆలపాటి రాజా హెచ్చరించారు.
- Tags
- Alapati Raja