- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో మున్సిపల్ పోరు.. నారా లోకేష్ కీలక నిర్ణయం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే మ్యానిఫెస్టోను విడుదల చేసింది. మరోవైపు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 4 నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు స్పష్టం చేశారు. ఈనెల 4 నుండి 8 వరకు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. తాజాగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈనెల […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే మ్యానిఫెస్టోను విడుదల చేసింది. మరోవైపు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 4 నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు స్పష్టం చేశారు. ఈనెల 4 నుండి 8 వరకు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. తాజాగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈనెల 4న విశాఖపట్నం ఎన్నికల ప్రచారంలో లోకేష్ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే చంద్రబాబు నాయుడు ఈ నెల 4న కర్నూలు జిల్లాలో, 5న చిత్తూరు జిల్లాలో, 6న విశాఖ జిల్లాలో, 7న విజయవాడలో, 8న గుంటూరు జిల్లాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే.
Next Story






