రాళ్ల దాడిపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు

by  |
రాళ్ల దాడిపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై దుండగులు రాళ్లు రువ్విన ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపక్ష టీడీపీ ఫిర్యాదు చేసింది. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్‌ను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్ కలిసి ఫిర్యాదు చేశారు.

కేంద్ర బలగాల పర్యవేక్షణలో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక పోలింగ్ జరగాలని ఎంపీలు కోరారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయాలని, ఎన్నికల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వంలోని వాలంటీర్లు భాగస్వాములు కాకుండా చూడాలని ఈసీని టీడీపీ ఎంపీలు కోరారు.

అటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడిపై ఫిర్యాదు చేశారు. తిరుపతిలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని టీడీపీ ఎంపీలు ఆరోపించారు.



Next Story