‘పోలీసులు వత్తాసు పలకడం వల్లే ఈ అనర్థాలు’

by Vadlamudi Anukaran |   (  Updated:2020-08-26 10:56:42  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు, వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పారు. శిరోముండనం ఘటన మరువకముందే&#8230; చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ నేతల బెదిరింపులకు భయపడి దళిత యువకుడు ఓం ప్రతాప్ ఆత్మహత్యకు పాల్పడ్డారని గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ప్రాణాలు తీసుకునేంతగా వేధిస్తారా? అంటూ లేఖలో ప్రశ్నించారు. ఇదేనా ప్రజాస్వామ్యం? వైసీపీ నాయకులకు పోలీసులు వత్తాసు పలకడం [&hellip;]</p>

‘పోలీసులు వత్తాసు పలకడం వల్లే ఈ అనర్థాలు’
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు, వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పారు. శిరోముండనం ఘటన మరువకముందే… చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ నేతల బెదిరింపులకు భయపడి దళిత యువకుడు ఓం ప్రతాప్ ఆత్మహత్యకు పాల్పడ్డారని గుర్తు చేశారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ప్రాణాలు తీసుకునేంతగా వేధిస్తారా? అంటూ లేఖలో ప్రశ్నించారు. ఇదేనా ప్రజాస్వామ్యం? వైసీపీ నాయకులకు పోలీసులు వత్తాసు పలకడం వల్లే ఈ అనర్థాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓం ప్రతాప్ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని, అతని కాల్ లిస్ట్‌ను పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు.

Next Story