- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోంది
<p>దిశ, ఏపీ బ్యూరో: ఎక్కడైనా అధికారంలో ఉన్నవాళ్లు రాష్ర్ట అభివృద్ధి గురించి ఆలోచిస్తారనీ, కానీ దీనికి భిన్నంగా ప్రతిపక్షంపై కక్ష సాధింపు కోసమే వైసీపీ ప్రభుత్వం రాత్రింబవళ్లు ఆలోచిస్తోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో శనివారం మాట్లాడుతూ.. అర్ధరాత్రి అరెస్టులు, చీకట్లో కూల్చివేతలు, పొద్దుపోయాక నోటీసులు ఇస్తున్నారని తప్పుబట్టారు. మాజీ ఎంపీ సబ్బంహరి స్థలంలోని నిర్మాణాల కూల్చివేతలపై హైకోర్టు స్టేటస్ కో ఇచ్చినా మూడు రోజుల్లో భవనాలను తొలగించాలని ప్రభుత్వం మరో […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఎక్కడైనా అధికారంలో ఉన్నవాళ్లు రాష్ర్ట అభివృద్ధి గురించి ఆలోచిస్తారనీ, కానీ దీనికి భిన్నంగా ప్రతిపక్షంపై కక్ష సాధింపు కోసమే వైసీపీ ప్రభుత్వం రాత్రింబవళ్లు ఆలోచిస్తోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో శనివారం మాట్లాడుతూ.. అర్ధరాత్రి అరెస్టులు, చీకట్లో కూల్చివేతలు, పొద్దుపోయాక నోటీసులు ఇస్తున్నారని తప్పుబట్టారు. మాజీ ఎంపీ సబ్బంహరి స్థలంలోని నిర్మాణాల కూల్చివేతలపై హైకోర్టు స్టేటస్ కో ఇచ్చినా మూడు రోజుల్లో భవనాలను తొలగించాలని ప్రభుత్వం మరో నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. కక్షా రాజకీయాల కోసం పాలనా యంత్రాగాన్ని, వ్యస్థలను వైసీపీ ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story






