‘వైసీపీ నాయకులు కోట్లు దండుకున్నారు’

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వం, నాయకులపై విమర్శలు చేశారు. పేరుకు పేదలకు ఇళ్ల స్థలాల పథకం.. కానీ, అది వైసీపీ పెద్దలకు దోచిపెట్టే పథకంలా మారిందంటూ చురకలు వేశారు. తూర్పు గోదావరి జిల్లాలో నివాసయోగ్యం కాని ముంపు ప్రాంతాలను.. ఎకరా రూ. 5 లక్షలు చేయని ఆవభూములను ఎకరా. రూ. 45 లక్షలకు కొనిపించి వైసీపీ నేతలు కమీషన్లను కోట్లలో దండుకున్నారని ఆరోపించారు. ఇలాంటి స్కామ్‌లు రాష్ట్రమంతా చోటు [&hellip;]</p>

‘వైసీపీ నాయకులు కోట్లు దండుకున్నారు’
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వం, నాయకులపై విమర్శలు చేశారు. పేరుకు పేదలకు ఇళ్ల స్థలాల పథకం.. కానీ, అది వైసీపీ పెద్దలకు దోచిపెట్టే పథకంలా మారిందంటూ చురకలు వేశారు. తూర్పు గోదావరి జిల్లాలో నివాసయోగ్యం కాని ముంపు ప్రాంతాలను.. ఎకరా రూ. 5 లక్షలు చేయని ఆవభూములను ఎకరా. రూ. 45 లక్షలకు కొనిపించి వైసీపీ నేతలు కమీషన్లను కోట్లలో దండుకున్నారని ఆరోపించారు.

ఇలాంటి స్కామ్‌లు రాష్ట్రమంతా చోటు చేసుకున్నాయని చెప్పారు. ఈ పథకం పేదల కోసమా? ప్రజాధనాన్ని పార్టీ నేతలకు దోచిపెట్టే పథకమా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. అందుకే ఈ భూముల కొనుగోలు పై సమగ్ర దర్యాప్తు జరిపించి, ప్రజాధనాన్ని కాపాడవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశాను అంటూ చంద్రబాబు ట్వీట్‌ చేశారు

Next Story