'స్త్రీ శక్తి అవార్డు'లను అందజేసిన టీసీఈఐ

by Harish |

<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ ఇండస్ట్రీ (టీసీఈఐ) ఈవెంట్స్ పరిశ్రమలో వివిధ రంగాలకు చెందిన మహిళలకు &#8216;స్త్రీ శక్తి అవార్డ్స్-2020&#8217;ను శనివారం అందజేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన టీసీఈఐ అధ్యక్షుడు రాఖీ కంకరియా.. పరిశ్రమలోని అర్హులైన మహిళలకు ఇది ఎంతో గౌరవనీయమైనది, ప్రత్యేకంగా వారి ప్రతిభను గుర్తించేందుకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈవెంట్ పరిశ్రమలో మహిళలు 30 శాతమే ఉన్నప్పటికీ, వారు ఎన్నో విజయాలను సృజనాత్మకంగా సాధించగలుగుతున్నారని చెప్పారు. ఇది మూడవ అవార్డుల [&hellip;]</p>

స్త్రీ శక్తి అవార్డులను అందజేసిన టీసీఈఐ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ ఇండస్ట్రీ (టీసీఈఐ) ఈవెంట్స్ పరిశ్రమలో వివిధ రంగాలకు చెందిన మహిళలకు ‘స్త్రీ శక్తి అవార్డ్స్-2020’ను శనివారం అందజేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన టీసీఈఐ అధ్యక్షుడు రాఖీ కంకరియా.. పరిశ్రమలోని అర్హులైన మహిళలకు ఇది ఎంతో గౌరవనీయమైనది, ప్రత్యేకంగా వారి ప్రతిభను గుర్తించేందుకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈవెంట్ పరిశ్రమలో మహిళలు 30 శాతమే ఉన్నప్పటికీ, వారు ఎన్నో విజయాలను సృజనాత్మకంగా సాధించగలుగుతున్నారని చెప్పారు.

ఇది మూడవ అవార్డుల ఎడిషన్. దీన్ని రెండు వేర్వేరు విభాగాల్లో ఇచ్చారు. అవి, స్త్రీ మూర్తి అవార్డ్స్-2020, స్త్రీ శక్తి అవార్డ్స్-2020 అని రాఖి కంకరియా తెలిపారు. కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఈవెంట్ పరిశ్రమ బాగా దెబ్బతిన్నదని టీసీఈఐ సెక్రటరీ జనరల్ నీరజ్ ఠాకూర్ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అవార్డ్స్ కార్యక్రమం పరిశ్రమలో ఎంతోమందికి ఉత్సాహాన్నిస్తుందన్నారు. అంతేకాకుండా, కస్టమర్లలో తాము నిర్వహించే ఈవెంట్స్ సురక్షితమనే భరోసా ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. నగరంలో మంచి పేరున్న స్టార్ వెంచర్స్ మెహర్ అరియా వ్యవస్థపుకులు, ప్లేబ్యాక్ సింగర్ భార్గవి పిళ్లై, ఇటీవల ఎస్ ఎస్ రాజమౌళి కుమారుడి వివాహానికి వెడ్డింగ్ ప్లానర్‌గా చేసిన వేదిక్ ఈవెంట్స్ డైరెక్టర్ ఎం ఎస్ ప్రసూన, బీఎన్ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజనా షాలకు ఈ ఏడాది స్త్రీ మూర్తి అవార్డులు అందజేసినట్టు టీసీఈఐ వెల్లడించింది.

వీరితో పాటు, నగరంలో బర్త్ డే ఈవెంట్ ఆర్గనైజర్ జ్యోతి వర్మ, ఎన్‌టీహెచ్ఎంకు చెందిన మిషెల్ జె ఫ్రాన్సిస్, రూప్ సురేఖ సహా మొత్తం 25 మందికి స్త్రీ శక్తి అవార్డులను అందజేసినట్టు టీసీఈఐ తెలిపింది. టీసీఈఐ సెక్రటరీ జనరల్ చెప్పిన వివరాల ప్రకారం.. తెలంగాణలో 1,100 ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలున్నాయి. ఈ పరిశ్రమలో సుమారు 5,500 మంది అసోసియేట్‌లు, అనుబంధ సంస్థలు ఉన్నాయని, దాదాపు 50 లక్షల మంది తెలంగాలో ఈవెంట్ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారన్నారు.

Next Story