చరిత్రలోనే తొలిసారిగా టాటా గ్రూప్ కీలక నిర్ణయం!

by  |
చరిత్రలోనే తొలిసారిగా టాటా గ్రూప్ కీలక నిర్ణయం!
X

దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా సంక్షోభం కారణంగా టాటా గ్రూప్ మేనెజ్‌మెంట్ సంస్థ చరిత్రలోనే తొలిసారిగా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వల్ల ఏర్పడ్డ నష్టాలను అధిగమించేందుకు ఖర్చులను తగ్గించే చర్యలను ప్రారంభించింది. ఇందులో భాగంగా టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ సహా, టాటా గ్రూప్ కంపెనీల సీఈవోల వేతనంలో 20 శాతం వరకూ కోత విధించడానికి నిర్ణయించారు. లాక్‌డౌన్ పరిణామాలతో వ్యాపారం ప్రభావితమైనందున కంపెనీ తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. కంపెనీ నిర్ణయాన్ని అనుసరించి, టాటా మోటార్స్, టాటా స్టీల్స్, టాటా పవర్, టాటా ఇంటర్‌నేషనల్, టాటా క్యాపిటల్, ట్రెంట్, వోల్టాస్ సీఈవోలు, ఎండీలు తమ జీతాలను తగ్గించుకోనున్నారు. వేతనాలతో పాటు బోనస్‌లను వదులుకోనున్నారు. వీరిలో టీసీఎస్ సీఈవో రాజేష్ గోపినాథన్ ముందున్నారు. కంపెనీ వెల్లడించిన దాని ప్రకారం.. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2019-20లో రాజేశ్ గోపినాథన్ వేతనం ఏకంగా 16.5 శాతం తగ్గి రూ. 13.3 కోట్లకు చేరింది. కంపెనీలోని కీలక పదవిలో ఉన్న ఉద్యోగులకు ప్రేరణగా నిలిచేందుకే రాజేష్ తన వేతనం తగ్గించడంలో ముందున్నట్టు సంస్థ వెల్లడించింది.


Next Story