ఆ వాహనాల పరిశ్రమ వృద్ధి సాధిస్తుంది : టాటా మోటార్స్

by  |
ఆ వాహనాల పరిశ్రమ వృద్ధి సాధిస్తుంది : టాటా మోటార్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే ఆర్థిక సంవత్సరంలో కమర్షియల్ వాహనాల పరిశ్రమ 30 శాతానికి పైగా వృద్ధి చెందుతుందని దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ అంచనా వేసింది. కంపెనీ గురువారం తన లైట్ కమర్షియల్ ట్రక్ ఆల్ట్రా స్లీక్ టీ-సిరీస్ వాహనాలను విడుదల చేసింది. వీటి ధర రూ. 13.99 లక్షల(ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. ఈ వాహనాన్ని తీసుకురావడం ద్వారా దేశీయ మార్కెట్లో ఈ విభాగంలోని వాహనాల డిమాండ్ పునరుద్ధరణకు వీలవుతుందని కంపెనీ భావిస్తోంది. ‘ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి సానుకూలంగా నమోదైంది. వచ్చే ఏడాది కూడా రెండంకెల వృద్ధిని పెరుగుతాయని ప్రభుత్వం, ఆర్‌బీఐ అంచనా వేశాయి. ఈ క్రమంలో కమర్షియల్ వాహనాల(సీవీ) పరిశ్రమ మొత్తం దేశీయ ఆర్థిక కార్యకలాపాలతో ముడిపడి ఉంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఏడాది సీవీ పరిశ్రమ వృద్ధి సాధించాలని ఆశిస్తున్నాం. అదే గనక జరిగితే రెండేళ్ల ప్రతికూలత తర్వాత తాము మళ్లీ పుంజుకున్నట్టే అని’ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ గిరీష్ వాగ్ వెల్లడించారు.


Next Story

Most Viewed