కార్లపై ప్రత్యేక తగ్గింపు ఆఫర్లు ప్రకటించిన టాటా కంపెనీ

by  |
కార్లపై ప్రత్యేక తగ్గింపు ఆఫర్లు ప్రకటించిన టాటా కంపెనీ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన కార్ల కొనుగోళ్లపై రాయితీలను ప్రకటించింది. ఈ నెల 31 వరకు లేదంటే స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుందని, దీనికింద కస్టమర్లకు రూ. 65 వేల వరకు ప్రయోజనాలు ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ప్రత్యేకంగా ప్రకటించిన ఈ ఆఫర్లు కంపెనీ కార్లు హారియర్, టియాగో, నెక్సాన్, టిగొర్ మోడళ్లపై ఉంటుందని తెలిపింది.

టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 25 వేలు, ఎక్స్ఛేంజీపై మరో రూ. 10 వేలు తగ్గింపు ఇవ్వనుంది. టిగోర్ సబ్‌కాంపాక్ట్ సెడాన్‌పై అధికంగా రూ. 30 వేలు ఉండగా.. ఇందులో కస్టమర్ డిస్కౌంట్ రూ. 15 వేలు, ఎక్స్ఛేంజీ బోనస్ రూ. 15 వేలని తెలిపింది. నెస్కా కారుపై రూ. 15 వేలు తగ్గింపు ఇస్తున్నామని, అయితే ఇది కేవలం డీజిల్ వేరియంట్‌పై మాత్రమే లభిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇక, తన ప్రీమియం 5-సీటర్ హారియర్‌పై అత్యధిక డిస్కౌంట్‌ను టాటా ఇచ్చింది. దీనిపై రూ. 65 వేల వరకు తగ్గింపు ఉంటుందని పేర్కొంది. ఇందులో కస్టమర్ డిస్కౌంట్ రూపంలో రూ. 25 వేలు, ఎక్స్ఛేంజీ ద్వారా రూ. 40 వేలు ఇవ్వనుంది. అయితే, హారియర్ మోడల్‌లో డార్క్ ఎడిషన్, ఎక్స్‌జెడ్ ప్లస్, ఎక్స్‌జెడ్ ప్లస్ ఏ, కామో ఎడిషన్‌లపై వర్తించదని వెల్లడించింది.


Next Story