ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాతా మధు విజయం.. ఘనంగా టీఆర్ఎస్ సంబురాలు

by  |
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాతా మధు విజయం.. ఘనంగా టీఆర్ఎస్ సంబురాలు
X

దిశ, ఖమ్మం రూరల్​ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు విజయం సాధించడంతో రూరల్​ టీఆర్‌ఎస్​పార్టీ శ్రేణులు మంగళవారం జిల్లా కార్యాలయం ముందు విజయోత్సవ ర్యాలీతో పాటు సంబురాలు చేసుకున్నారు. తాతా మధుకు రూరల్‌‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉండటంతో ఇక్కడి పార్టీ నాయకులు తాతా గెలుపులో తమదైన ముఖ్య భూమికను పోషించారు.

మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, ఎంపీపీ బెల్లం ఉమాలు.. మండలంలోని ఎంపీటీసీలతో పాటు ఇతర పార్టీ ఎంపీటీసీలను సైతం తమ వైపుకు తిప్పడంలో కీలకపాత్ర పోషించారు. ఎంపీపీ బెల్లం ఉమా, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్‌లు జిల్లా పార్టీ కార్యాలయ ఆవరణలో పార్టీ కార్యకర్తలతో కలిసి స్టెప్పులు వేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తాతా మధును మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, ఎంపీపీ బెల్లం ఉమాలు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.


Next Story