కరీంనగర్‌లో గుట్కా విక్రయదారుల అరెస్ట్

by Sridhar Babu |

<p>దిశ, కరీంనగర్: నిషేధిత గుట్కా విక్రయిస్తున్న ముగ్గురిని కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం పట్టణంలో గుట్కా విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. కరీంనగర్‌లోని పాతబజార్‌కు చెందిన సముద్రాల వేణు, గౌరిశెట్టి వెంకటేశం, మాడిశెట్టి సంతోష్‌లు గుట్కా విక్రయిస్తున్నట్టు గుర్తించారు. వారి నుంచి 1.10 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు, కారు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఏసీపీ విద్యాసాగర్‌రావుగౌడ్, [&hellip;]</p>

కరీంనగర్‌లో గుట్కా విక్రయదారుల అరెస్ట్
X

దిశ, కరీంనగర్: నిషేధిత గుట్కా విక్రయిస్తున్న ముగ్గురిని కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం పట్టణంలో గుట్కా విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. కరీంనగర్‌లోని పాతబజార్‌కు చెందిన సముద్రాల వేణు, గౌరిశెట్టి వెంకటేశం, మాడిశెట్టి సంతోష్‌లు గుట్కా విక్రయిస్తున్నట్టు గుర్తించారు. వారి నుంచి 1.10 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు, కారు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఏసీపీ విద్యాసాగర్‌రావుగౌడ్, సీఐలు రత్నాపురం ప్రకాశ్, శశిధర్, సీఐ విజ్ఞాన్‌రావు పాల్గొన్నారు.

Tags: Karimnagar,Taskforce police, Ghutkha,sales,Arrest

Next Story