బైక్ షోరూంపై టాస్క్ ఫోర్స్ దాడి

by Batti.Sumithra |

<p>దిశ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని ఓ బైక్ షో రూంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. షో రూంలో అనుమతులు లేకుండా స్కీములు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో ఈ దాడులు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. షో రూంపై దాడి చేసిన పోలీసులు పలు దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. షో రూమ్ యజమాని సహా 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ నిమిత్తం కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే [&hellip;]</p>

బైక్ షోరూంపై టాస్క్ ఫోర్స్ దాడి
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని ఓ బైక్ షో రూంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. షో రూంలో అనుమతులు లేకుండా స్కీములు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో ఈ దాడులు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. షో రూంపై దాడి చేసిన పోలీసులు పలు దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

షో రూమ్ యజమాని సహా 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ నిమిత్తం కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే షో రూంలో ఎలాంటి స్కీములు నిర్వహించడం లేదని షో రూమ్ యజమాని భానుప్రసాద్ తెలిపారు. పోలీసులకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

Next Story