తరుణ్ భాస్కర్‌ను భయపెట్టిన ప్రాజెక్టులు..

by  |
తరుణ్ భాస్కర్‌ను భయపెట్టిన ప్రాజెక్టులు..
X

దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్ తరుణ్ భాస్కర్ త్వరలో బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ చేయబోతున్నాడు. #3 తనను ఇబ్బందుల్లోకి నెట్టిందని, భయం నన్ను దాదాపు చంపేసిందని పోస్ట్ పెట్టిన తరుణ్.. అసలు అదేంటో చెప్పబోతున్నాడు. రెండు బిగ్ ప్రాజెక్టులు ఉన్నాయని, అవి ఎంచుకునేందుకు చాలా ఆలోచించానన్న తరుణ్.. ఇంతకు ముందు కన్నా ఎక్కువ ఒత్తిడికి గురయ్యానని తెలిపాడు. కానీ ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ డీల్ చేయాలని నిర్ణయించుకుని.. ఫస్ట్ టైమ్ క్రైమ్ డ్రామా రాయడానికి ఎంచుకున్నానని చెప్పాడు. తను అమితంగా ఆరాధించే ఓ స్టార్ ఇందులో నటించాడన్న తరుణ్.. ఇది ఖచ్చితంగా మిమ్మల్ని మెప్పిస్తుందని, నిరాశపరిచే సమస్యే లేదన్నాడు.

కాగా ఈ క్రైమ్ డ్రామా రాసింది నెట్‌ఫ్లిక్స్ కోసమే అని తెలుస్తోంది. ఈ రెండు బిగ్ ప్రాజెక్టులు కూడా నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్ అని.. గోవాలో ఇందుకు సంబంధించిన షూటింగ్ జరిగిందని సమాచారం. కాగా దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఈ క్రమంలోనే తరుణ్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ కూడా పంపింది నెట్‌ఫ్లిక్స్.

Next Story