ఆ హీరోది చాలా ఫ్రెండ్లీ నేచర్.. కితాబిచ్చిన యంగ్ హీరోయిన్

by  |
ఆ హీరోది చాలా ఫ్రెండ్లీ నేచర్.. కితాబిచ్చిన యంగ్ హీరోయిన్
X

దిశ, సినిమా : కార్తికేయ హీరోగా సరిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రాజా విక్రమార్క’. ఈ చిత్రం ద్వారా తాన్యా రవిచంద్రన్ తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయం కానుంది. ఈ నెల 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనుండగా తాన్య మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను వెల్లడించింది. చెన్నైలో పీజీ చదువుతున్నప్పుడే కోలీవుడ్‌లో అవకాశం రావడంతో వరుసగా మూడు సినిమాలు చేసినట్లు తెలిపింది.

‘రాజా విక్రమార్క’ సినిమాలో హీరోయిన్‌ పాత్రకు ఇంపార్టెన్స్ ఉండటంతో ఒప్పుకున్నట్లు తెలిపింది. ఇక కార్తికేయతో వర్క్ ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడుతూ.. కార్తికేయ వెరీ స్వీట్ అండ్ ఫ్రెండ్లీ పర్సన్ అని, తన యాక్టింగ్ చాలా నేచురల్‌గా ఉంటుందని కితాబిచ్చింది. ఆమె తాతయ్య, సీనియర్ హీరో రవిచంద్రన్‌ను గుర్తుచేసుకుంటూ.. ఆయన నుంచి వ్యక్తిగతంగా హార్డ్ వర్కింగ్, డెడికేషన్, డిసిప్లిన్ నేర్చుకున్నాని చెప్పుకొచ్చింది.

అచ్చం అతిలోక సుందరిలా జాన్వీకపూర్.. ఫ్యాన్స్‌‌కి సర్‌ప్రైజ్

Next Story

Most Viewed