ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తున్న‌ది క‌మ్యునిస్టులే: తమ్మినేని

32

దిశ ప్ర‌తినిధి ,హైద‌రాబాద్: ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్న‌ది క‌మ్యూనిస్టు పార్టీ మాత్రమేన‌ని సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం అన్నారు. సుంద‌ర‌య్య విజ్ఞాన కేంద్రంలో న‌వ తెలంగాణ ప‌బ్లిషింగ్ హౌస్‌లో వందేళ్ల క‌మ్యూనిస్టు ఉద్య‌మ సాహిత్య పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌ను ఆయ‌న బుధవారం ప్రారంభించారు. 31 వ‌ర‌కు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… భార‌త దేశంలో కార్మిక , క‌ర్ష‌క రైతాంగ ఉద్య‌మాన్ని నిర్మించిన ఘ‌న‌త క‌మ్యూనిస్టు పార్టీల‌ద‌ని అన్నారు . 1920 లో తాష్కెంట్‌లో భార‌త క‌మ్యూనిస్టు పార్టీ ప్రారంభ‌మైంద‌ని , భౌతిక వాద సూత్రాల పునాదిపై లెనిన్ సారథ్యంలో సోష‌లిస్టు ర‌ష్యా ఏర్ప‌డ‌డం , ప్ర‌పంచంలో అనేక దేశాల విముక్తికి స్పూర్తిగా నిలిచిన తీరును ఆయ‌న వివ‌రించారు . ఈ సంద‌ర్భంగా సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కొండూరి వీర‌య్య సంక‌ల‌నం చేసిన లెనిన్ యాది లో గ్రంథాన్ని ఆయ‌న ఆవిష్క‌రించారు.