- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంచలన వ్యాఖ్యలు: ఆ టీడీపీ నేతను భూమిలోకి తొక్కేస్తానన్న స్పీకర్ తమ్మినేని
<p>దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నేత కూన రవికుమార్‌పై స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. వామనావతారుడి మాదిరి భూమిలోకి తొక్కేస్తానంటూ హెచ్చరించారు. ఎవరికి ఎక్కడ ఎలా చెక్ పెట్టాలో తనకు తెలుసునన్నారు. తాను కచ్చితంగా ఆ పంథాలో వెళతానని.. గట్టిగా అరిస్తే బెదిరిపోయేవాడిని కాదని చెప్పుకొచ్చారు. జిల్లాలో ఆముదాలవలసకు ఒకే ఒక్క ఎమ్మెల్యేను తానేనని చెప్పుకుంటూ ఉండేవాడని ఇప్పుడు ఏమైందన్నారు. ఆముదాలవలసకు 30 ఏళ్లు తానే ఎమ్మెల్యే అని చెప్పుకున్న కూన ఒక్క దెబ్బకు […]</p>

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నేత కూన రవికుమార్‌పై స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. వామనావతారుడి మాదిరి భూమిలోకి తొక్కేస్తానంటూ హెచ్చరించారు. ఎవరికి ఎక్కడ ఎలా చెక్ పెట్టాలో తనకు తెలుసునన్నారు. తాను కచ్చితంగా ఆ పంథాలో వెళతానని.. గట్టిగా అరిస్తే బెదిరిపోయేవాడిని కాదని చెప్పుకొచ్చారు. జిల్లాలో ఆముదాలవలసకు ఒకే ఒక్క ఎమ్మెల్యేను తానేనని చెప్పుకుంటూ ఉండేవాడని ఇప్పుడు ఏమైందన్నారు.
ఆముదాలవలసకు 30 ఏళ్లు తానే ఎమ్మెల్యే అని చెప్పుకున్న కూన ఒక్క దెబ్బకు పడిపోయాడన్నారు. అంత అహంకారం..అహంభావం ఎవరికీ పనికిరాదని స్పీకర్ సీతారాం హితవు పలికారు. కూన రవికుమార్ అరుపులు, కేకలు తన ముందు పనిచేయవన్నారు. మంచిగా ప్రజా సేవ చేసుకుంటూ ముందుకు వెళ్దామని అంతేగానీ లేనిపోని అరుపులు దేనికి అని ప్రశ్నించారు. ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి ప్రస్తుతం అభివృద్ధిపై దృష్టి పెడదామని.. మళ్లీ ఎన్నికలొచ్చాక తిట్టుకుందామన్నారు. అప్పుడు ఎవరి ముక్కుకు మసి అంటుకుందో ప్రజలే తేలుస్తారని స్పీకర్ సీతారాం అన్నారు.






