- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనా సోకిందని మళ్లీ మూసేసిన నోకియా!
by Harish |
<p>దిశ, సెంట్రల్ డెస్క్:సుమారు రెండు నెలల లాక్‌డౌన్ ఆంక్షల తర్వాత ఇప్పుడిప్పుడే కర్మాగారాలను ప్రారంభిస్తున్న కంపెనీలకు కరోనా భయం వీడటం లేదు. ఇటీవల లాక్‌డౌన్ సడలింపులతో న్యూఢిల్లీలోని ప్లాంట్‌లను ప్రారంభించిన ఒప్పో కంపెనీలో 9 మందికి కరోనా సోకడంతో ప్లాంట్‌ను మూసేసిన సంగతి తెలిసిందే. తాజాగా, నోకియా సైతం ఇదే బాట పట్టింది. తమిళనాడులోని చెన్నై సమీపంలో శ్రీ పెరంబదూర్ ప్రాంతంలో ఉన్న నోకియా ప్లాంట్‌ను మూసేస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. నోకియా ఫోన్ తయారీ కంపెనీలో 42 […]</p>

X
దిశ, సెంట్రల్ డెస్క్:సుమారు రెండు నెలల లాక్‌డౌన్ ఆంక్షల తర్వాత ఇప్పుడిప్పుడే కర్మాగారాలను ప్రారంభిస్తున్న కంపెనీలకు కరోనా భయం వీడటం లేదు. ఇటీవల లాక్‌డౌన్ సడలింపులతో న్యూఢిల్లీలోని ప్లాంట్‌లను ప్రారంభించిన ఒప్పో కంపెనీలో 9 మందికి కరోనా సోకడంతో ప్లాంట్‌ను మూసేసిన సంగతి తెలిసిందే. తాజాగా, నోకియా సైతం ఇదే బాట పట్టింది. తమిళనాడులోని చెన్నై సమీపంలో శ్రీ పెరంబదూర్ ప్రాంతంలో ఉన్న నోకియా ప్లాంట్‌ను మూసేస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. నోకియా ఫోన్ తయారీ కంపెనీలో 42 మందికి కరోనా సోకిందని తెలుస్తున్నప్పటికీ, సంస్థ అధికారికంగా ఖచ్చితమైన సంఖ్యను వెల్లడించలేదు. అయితే, త్వరలో భౌతిక దూరం పాటిస్తూ తక్కువ సంఖ్యలో కార్మికులు ఉండేలా మార్పులు చేస్తామని ప్రకటించింది.
Next Story






