సడెన్ గా బస్సు ఎక్కి అందరినీ ఆశ్చర్యపరిచిన సీఎం.. వీడియో వైరల్

by  |
TN-MK-Stalin1
X

దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను షేర్ చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తమిళనాడులో ఆరో మెగా ఇంక్యులేషన్ డ్రైవ్ లో భాగంగా ఏర్పాటు చేసిన టీకా కేంద్రాలను పరిశీలించేందుకు శనివారం సీఎం స్టాలిన్ బయలుదేరారు. కన్నగి నగర్ వద్దకు రాగానే మహిళలను ఉచితంగా తీసుకెళ్లే పబ్లిక్ బస్సు అటు వైపుగా వెళ్తోంది. వెంటనే తన కాన్వాయ్ ని ఆపి ఆ బస్సు ఎక్కారు. బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో మాట్లాడి ఉచిత ప్రయాణం గురించి, అదేవిధంగా ఇతర విషయాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. సీఎం బస్సు ఎక్కడంతో ఆ ప్రయాణికులంతా మొదటగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత ఆనందంతో స్టాలిన్ తో సెల్ఫీలు తీసుకున్నారు . ఇందుకు సంబంధించిన వీడియోను సీఎంవో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed