రష్మిక ఫస్ట్ తమిళ్ ఫిల్మ్ షూటింగ్ పూర్తి..

240

దిశ, వెబ్ డెస్క్ : సూపర్ ప్రెట్టీ హీరోయిన్ రష్మిక మందన.. కన్నడం, తెలుగులో సూపర్ టాలెంటెడ్ అండ్ గ్లామరస్ హీరోయిన్‌గా కాంప్లిమెంట్స్ అందుకుంది. వరుస విజయాలు సొంతం చేసుకుంటూ సక్సెస్ ట్రాక్‌లో దూసుకుపోతోంది. తెలుగులో చివరగా ‘భీష్మ’ సినిమాలో కనిపించిన భామ.. ఇప్పుడు తమిళ పరిశ్రమను ఏలేందుకు సిద్ధమైంది. కార్తీ హీరోగా వస్తున్న ‘సుల్తాన్’ సినిమాతో రష్మిక కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తుండగా.. లాక్‌డౌన్‌కు ముందే 90 శాతం పూర్తయిన సినిమా చిత్రీకరణ ఈ మధ్యే మళ్లీ ప్రారంభించారు. బక్కియారాజ్ కణ్ణన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగా.. ఇందుకు సంబంధించి పోస్ట్ పెట్టింది రష్మిక.

తన తొలి తమిళ సినిమా సుల్తాన్ షూటింగ్ పూర్తయిందని.. తను ఇప్పటి వరకు పని చేసిన స్వీట్ టీమ్స్ లో ఇది కూడా ఒకటని చెప్పింది. ఇక టఫ్ లొకేషన్లలో షూటింగ్ జరిగితే ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడేదాన్నని తెలిపిన రష్మిక.. ఈ సినిమా సెట్‌లో మాత్రం ఎప్పుడూ ఫన్‌గా గడిపానని తెలిపింది. ఇన్ని రోజులు తనను భరించినందుకు సుల్తాన్ టీమ్ కు ధన్యవాదాలు తెలిపింది. మూవీ యూనిట్‌కు లవ్ యూ చెప్తూ ఆల్ ది బెస్ట్ చెప్పింది.

మూడేళ్ల కిందట విన్న ఈ కథ.. అప్పటి నుంచి తమను ఉత్తేజ పరుస్తోందని చెప్పిన కార్తీ.. ఇప్పటి వరకు తను చేసిన అతి పెద్ద సినిమాల్లో ఇది కూడా ఒకటని తెలిపాడు. కాగా, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్న సినిమాలో పొన్నాంబలం, యోగి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..