ప్రభాస్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగలడు : తమన్నా

by  |
ప్రభాస్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగలడు : తమన్నా
X

మిల్కీ బ్యూటీ తమన్నా… కెరీర్ లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను చేసింది. తెలుగు, తమిళ్, హిందీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తమన్నా… తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ యాక్టింగ్ స్కిల్స్ గురించి కాంప్లిమెంట్స్ ఇచ్చింది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్…. ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగలడని చెప్పింది. ప్రభాస్ తో రెబల్ మూవీ చేసినా… ఆ సమయంలో అంత క్లోజ్ కాలేదని … అతనితో ఇంటరాక్ట్ అయ్యే చాన్స్ దొరకలేదని తెలిపింది. బాహుబలి సినిమా సమయంలోనే మంచి ఫ్రెండ్స్ అయ్యామని చెప్పింది తమన్నా.

ప్రస్తుతం సీటిమార్ సినిమాలో చేస్తున్నట్లు తెలిపిన మిల్కీ బ్యూటీ… కబడ్డీ ఆట నేపథ్యంలో ఉండే చిత్రంలో కోచ్ గా కనిపించనున్నట్లు చెప్పింది. ఇంతకు ముందు చేయలేని పాత్ర ఇది అని… కొత్తగా ట్రై చేస్తున్నానని తెలిపింది. కాగా సినిమా కోసం కబడ్డిలో మెళకువలు నేర్చుకునేందుకు ట్రైనింగ్ కూడా తీసుకుంటుందట. ప్రతీ యాక్టర్ కు ఒక ప్రత్యేకమైన సినీ ప్రయాణం ఉంటుందన్న తమన్నా… ఇప్పటి వరకు చేసిన సినిమాలను పరిశీలిస్తే చిత్రాల ఎంపికలో సరైన నిర్ణయం తీసుకున్నాను అనిపిస్తుంది అని తెలిపింది తమన్నా.

Tags: Prabhas , Tamanna, Bahubali, Seetimaar, Tollywood



Next Story