- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్నడలో ఎంట్రీ ఇవ్వనున్న తమన్నా
<p>దిశ, వెబ్ డెస్క్ : మిల్కీబ్యూటీ తమన్నా.. స్పెషల్ సాంగ్స్ లో తళుక్కున మెరుస్తూనే.. మరోపక్క హీరోయిన్ గానూ అవకాశాలు చేజిక్కించుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు మరో మంచి ఛాన్స్ రాబోతున్నట్టు తెలుస్తోంది. కెరీర్ పరంగా ఇటీవల కాలంలో పెద్ద హిట్ అందుకోలేని తమన్నా… కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా చేస్తున్న ఓ సినిమాలో హీరోయిన్ గా చేయబోతుందని సమాచారం. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించిన మిల్కీబ్యూటీ ఇది వరకు కన్నడ సినిమాల్లో హీరోయిన్ […]</p>

దిశ, వెబ్ డెస్క్ :
మిల్కీబ్యూటీ తమన్నా.. స్పెషల్ సాంగ్స్ లో తళుక్కున మెరుస్తూనే.. మరోపక్క హీరోయిన్ గానూ అవకాశాలు చేజిక్కించుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు మరో మంచి ఛాన్స్ రాబోతున్నట్టు తెలుస్తోంది. కెరీర్ పరంగా ఇటీవల కాలంలో పెద్ద హిట్ అందుకోలేని తమన్నా… కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా చేస్తున్న ఓ సినిమాలో హీరోయిన్ గా చేయబోతుందని సమాచారం. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించిన మిల్కీబ్యూటీ ఇది వరకు కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా చేయలేదు. గతంలో జాగ్వార్, కె.జి.యఫ్ చిత్రాల్లో స్పెషల్‌సాంగ్స్‌తో ఆకట్టుకుంది. కన్నడ రాకింగ్‌స్టార్ యష్ హీరోగా నర్తన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందట. ఆ సినిమాకి సంబంధించిన కథా చర్చలు పూర్తయ్యాయని అంటున్నారు. కథానాయికగా తమన్నా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ప్రచారం జరిగింది. ఈ సినిమా చేయడానికి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనేది తాజా సమాచారం. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం యశ్ .. ‘కేజీఎఫ్ 2’ చేస్తున్నాడు. అక్టోబర్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతో వున్నారు.
Tags: tamanna, yash, kannada, narthan






