వరుణ్ తేజ్ కోసం తమన్నా స్పెషల్ నంబర్

by  |
tamannah
X

దిశ, సినిమా : ‘గద్దలకొండ గణేష్’ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. ‘ఘని’ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీలో తమన్నాతో స్పెషల్ డ్యాన్స్ సీక్వెన్స్ ప్లాన్ చేశారట డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి. ఈ విషయంపై స్పందించిన తమన్నా.. వరుణ్ తేజ్‌తో పనిచేయడం చాలా సరదాగా ఉంటుందని, షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపింది.

సాంగ్ లిరిక్స్ చాలా క్యాచీగా ఉండటంతో పాటు సినిమాలోనూ కథానుగుణంగా వస్తుందని వెల్లడించింది. కాగా ఈ పాటకు షాజియా సంజీ, పీయూష్ భగత్ కొరియోగ్రఫీ చేయనున్నారు. ఇక తమన్నా కెరీర్ విషయానికొస్తే.. అప్‌కమింగ్ తెలుగు ఫిల్మ్ ‘ఎఫ్3’లో వరుణ్ తేజ్‌కు మరదలుగా కనిపించనుంది. అంతేకాదు నితిన్ ‘మాస్ట్రో’లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న తమన్నా.. ‘సీటీమార్, గుర్తుందా శీతాకాలం’ చిత్రాల్లోనూ నటిస్తోంది.

Next Story

Most Viewed