మహిళలపై నిషేధం.. ‘బాడీ ఎక్స్‌పోజింగ్’ కావొద్దనే ఇలా చేశాం : తాలిబన్లు

334

దిశ, వెబ్‌డెస్క్ : ఆఫ్ఘన్ మహిళలు క్రీడలు ఆడొద్దని తాలిబన్లు ఆదేశాలు జారీచేశారు. అలా చేయడం వలన మీ బాడీలు ఎక్స్‌పోజ్ అవుతాయని, అది షరియత్‌కు వ్యతిరేకమని తాలిబన్ కల్చరల్ కమిషన్ డిప్యూటీ హెడ్ అహ్మదుల్లా వాసిఖ్ పేర్కొన్నారు. మీడియా ద్వారా ఆఫ్ఘన్ మహిళా క్రీడాకారుల ఫోటోలను ప్రపంచం వీక్షిస్తుందని, అందుకు తాలిబన్ల ప్రభుత్వం అంగీకరించదని స్పష్టంచేశారు. క్రికెట్ సహా మిగతా క్రీడల్లోనూ మహిళల ప్రమేయాన్ని తాలిబన్లు సహించబోరని ఆయన వెల్లడించారు. అందువల్లే మహిళలను క్రీడల విషయంలో ఎంకరేజ్ చేయబోమని వివరించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..