ఆఫ్ఘన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఐసీస్ ఏరివేతకు గ్రీన్‌సిగ్నల్

by  |
talibans next target kashmir
X

దిశ, వెబ్‌డెస్క్ : అష్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని కూల్చి ఆఫ్ఘనిస్తాన్‌‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లకు ఐసీస్ ఉగ్రవాదులు తలనొప్పిగా మారారు. ఆప్ఘనిస్తాన్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడుతూ మరణహోమాలను సృష్టిస్తున్నారు. ఇటీవల అక్కడ జరిగిన వరుస పేలుళ్లలో వందల సంఖ్యలో ప్రజలు మరణించినట్టు వార్త కథనాలు వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలోనే తాలిబన్ ప్రభుత్వం ఈ విధ్వంసానికి చరమగీతం పాడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఐసీస్ ఉగ్రవాదులను ఏరివేసేందుకు చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే కాబూల్ శివారులో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్టు సమాచారం. అంతేకాకుండా, ఐసీస్ కీలక స్థావరాలను ధ్వంసం చేయాలని తాలిబన్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.


Next Story

Most Viewed