ఈటల గెలిస్తే హుజురాబాద్‌కు ఒరిగేది ఏమీ లేదు: తలసాని

by Sridhar Babu |

<p>దిశ, మానకొండూరు: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ దొంగ ఏడుపు ఏడుస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం కరీంనగర్ సమీపంలోని ఎల్‌ఎండీ గెస్ట్ హౌజ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హుజురాబాద్ ఎన్నికలు ఎందుకొచ్చాయో ప్రజలకు తెలుసన్నారు. హుజురాబాద్‌లో ఒక మాట హైదరాబాద్‌లో మరో మాట మాట్లాడే వ్యక్తి ఈటల అంటూ విమర్శలు చేశారు. ఈటల రాజేందర్ గెలిస్తే బీజేపీకి మూడో ఎమ్మెల్యేగా మిగలడం తప్పా.. హుజురాబాద్ ప్రజలకు మాత్రం ఓరిగేది ఏమీ ఉండదన్నారు. గెల్లు [&hellip;]</p>

ఈటల గెలిస్తే హుజురాబాద్‌కు ఒరిగేది ఏమీ లేదు: తలసాని
X

దిశ, మానకొండూరు: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ దొంగ ఏడుపు ఏడుస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం కరీంనగర్ సమీపంలోని ఎల్‌ఎండీ గెస్ట్ హౌజ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హుజురాబాద్ ఎన్నికలు ఎందుకొచ్చాయో ప్రజలకు తెలుసన్నారు. హుజురాబాద్‌లో ఒక మాట హైదరాబాద్‌లో మరో మాట మాట్లాడే వ్యక్తి ఈటల అంటూ విమర్శలు చేశారు. ఈటల రాజేందర్ గెలిస్తే బీజేపీకి మూడో ఎమ్మెల్యేగా మిగలడం తప్పా.. హుజురాబాద్ ప్రజలకు మాత్రం ఓరిగేది ఏమీ ఉండదన్నారు. గెల్లు శ్రీనివాస్ భారీ మెజార్టీతో గెలుస్తారని.. నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్‌తోనే సాధ్యమన్నారు.

Next Story