సీఎం జగన్ కు తైవాన్ ప్రతినిధుల ఆహ్వానం

by  |
సీఎం జగన్ కు తైవాన్ ప్రతినిధుల ఆహ్వానం
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి మంచి అవకాశాలున్నాయి. ఓ సారి మా దేశానికి రండి అంటూ తైవాన్ ఎకనమిక్ అండ్ కల్చరల్సెంటర్ డైరెక్టర్జనరల్బెన్వాంగ్సీఎం జగన్ ను ఆహ్వానించారు. శుక్రవారం పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో తైవాన్‌కు చెందిన వివిధ కంపెనీలతో మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

అనంతరం టీఈసీసీ డైరెక్టర్‌ జనరల్‌ తో పాటు ఆ దేశానికి చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని విధాలా సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశమున్న వివిధ రంగాలు, పరిశ్రమల వివరాలను ప్రతినిధులు సీఎంకు వివరించారు. గ్రీన్‌ టెక్‌ ఇండస్ట్రీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మాథ్యూ చిన్, ఇండియా ఫాక్స్‌లింక్‌ డైరెక్టర్‌ ఎరిక్‌ ని, అపాచీ పుట్‌వేర్‌కు చెందిన గవిన్‌ ఛాంగ్, పీఎస్‌ఏ వాల్సిన్‌ ప్రాజెక్టు మేనేజర్‌ నిరంజన్‌ ప్రకాష్‌తో పాటు పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్, ఆ శాఖ డైరెక్టర్‌ జె.సుబ్రమణ్యం సమావేశంలో పాల్గొన్నారు.


Next Story

Most Viewed