‘రిప్డ్’ జీన్స్ వ్యాఖ్యలకు కౌంటర్‌.. బికినీ ఫొటో షేర్ చేసిన హీరో వైఫ్

by  |
ripped jeans
X

దిశ, సినిమా: మహిళలు రిప్డ్(చిరిగిన) జీన్స్ ధరించడం సరైనది కాదని ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా, తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని ఆయన కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా మహిళలు, సెలబ్రిటీలతో పాటు బిగ్ బీ అమితాబ్ మనవరాలు నవ్య నవేలి కూడా సీఎం వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా ఈ వ్యాఖ్యలపై వెర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా వైఫ్ తహిరా కశ్యప్ కూడా స్పందించింది.

రైటర్, ఫిల్మ్ మేకర్ అయిన తహిరా కశ్యప్.. ఇన్‌స్టా వేదికగా సీఎం తీరత్ సింగ్ రావత్‌కు వ్యతిరేకంగా పోస్టు పెట్టింది. బాల్డ్ హెడ్(బోడి గుండు)తో ఉన్న తన బికినీ ఫొటోను ‘ఎట్ లీస్ట్ నాట్ వియరింగ్ రిప్డ్ జీన్స్(చిరిగిన జీన్స్ ధరించడం లేదు)’ అనే క్యాప్షన్ పెట్టి షేర్ చేసింది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు సీఎం వ్యాఖ్యలు సరికాదని చెప్తున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు భూమి పెడ్నేకర్, ఏక్తాకపూర్ తదితరులు సైతం ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. రిప్డ్ జీన్స్ ధరిస్తే తప్పేంటి? అని ప్రశ్నిస్తున్నారు.



Next Story

Most Viewed