బాడీ ఫిట్‌నెస్‌ ఆరోగ్యానికి పునాది: తాప్సీ

by  |
బాడీ ఫిట్‌నెస్‌ ఆరోగ్యానికి పునాది: తాప్సీ
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్‌లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న తాప్సీ.. అందుకు తగ్గ పాత్రలే ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతోంది. పాత్ర కోసం ఎంత కష్టపడేందుకైనా సిద్ధపడే ఈ ఢీల్లీ బ్యూటీ ప్రస్తుతం ‘రష్మి రాకెట్‌’ సినిమా కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో పర్‌ఫెక్ట్ అథ్లెట్‌గా కనిపించేందుకు కసరత్తులు చేయడంతో పాటు తన డైట్ కూడా చేంజ్ చేసింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ సెషన్స్‌కు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేస్తున్న తాప్సీ.. తాజాగా తన ‘డైరీ డైట్’ విషయాన్ని వెల్లడించింది.

‘స్వతహాగా పంజాబీ కావడంతో దహీ, లస్సీ అంటే ఎంతో ఇష్టంగా తినేదాన్ని. కానీ చాలా సంవత్సరాల నుంచి పాలు, పాల ఉత్పత్తులను అవాయిడ్ చేస్తూ వస్తున్నాను. అయితే న్యూట్రిషనిస్ట్, ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్, యోగా టీచర్ మున్‌మున్ గనేరివాల్‌తో వర్క్ చేస్తున్నప్పటి నుంచి డైరీ ప్రొడక్ట్స్ వల్ల ఆరోగ్యానికి కలిగే మేలును తెలుసుకున్నాను. ఆమె సూచించిన హెల్త్ సీక్రెట్స్, హెల్త్ వేస్ ఆరోగ్య పరంగా మ్యాజిక్‌లా పనిచేశాయి. ఇప్పుడెంతో ఆరోగ్యంగా, ఫిట్‌గా మారాను. ‘రష్మి రాకెట్’ కోసం గనేరివాల్ ప్లాన్ చేసిన డైట్‌లో నెయ్యి, పెరుగు, బటర్ మిల్క్, ప్రొటీన్ షేక్స్, డెయిరీ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆరోగ్యకరమైన శరీరమే, గొప్ప ఫిట్‌నెస్‌కు పునాది’ అని తాప్సీ పేర్కొంది.

గుజరాత్‌లోని ఓ పల్లెటూరికి చెందిన ఫాస్ట్ రన్నర్ రష్మి అనే యువతి కథే.. రష్మి రాకెట్ చిత్ర కథ కాగా, ఈ క్యారెక్టర్ కోసం తాప్సీ మేకోవర్ చూసి అందరూ ఖుదోస్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కర్ష్ ఖురానా దర్శకత్వం వహిస్తున్నాడు. తాప్సీ ఈ సినిమాతో పాటు ‘హసీన్ దిల్ రుబా, శభాష్ మిథు’ వంటి బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండగా, సౌత్ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న సినిమాలోనూ లీడ్ రోల్ పోషిస్తోంది.



Next Story

Most Viewed