నాతో ఇంటిమేట్ సీన్స్‌కు భయపడ్డారు : తాప్సీ

by  |
నాతో ఇంటిమేట్ సీన్స్‌కు భయపడ్డారు : తాప్సీ
X

దిశ, సినిమా : హీరోయిన్ తాప్సీ తన లేటెస్ట్ ఫిల్మ్ ‘హసీన్ దిల్‌రుబా’లో కోస్టార్స్‌గా నటించిన విక్రాంత్ మాసే, హర్షవర్ధన్ రాణే గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. కనిక ధిల్లాన్ రైటర్‌గా వినిల్ మథ్యూ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్ శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. కాగా ఫిల్మింగ్‌కు సంబంధించిన ఇన్సిడెంట్స్‌పై తాజా ఇంటర్వ్యూలో వెల్లడించిన తాప్సీ.. బహుషా తన ఇమేజ్ లేదా ఇంకా ఏవో ప్రాబ్లమ్స్‌ వల్ల విక్రాంత్, హర్షవర్థన్ ఇద్దరూ తనతో ఇంటిమేట్ సీన్స్‌లో నటించేందుకు భయపడ్డారని తెలిపింది.

దీంతో వాళ్లిద్దరినీ కంఫర్ట్‌గా ఉంచేందుకు ట్రై చేశానని, ఈ విషయంపై డైరెక్టర్‌కు కూడా కంప్లయింట్ చేసేదాన్నని గుర్తుచేసుకుంది. ఫ్యూచర్‌లో ఇలాంటి ఇంటిమేట్ సీన్స్‌లో నటించాల్సి వచ్చినపుడు మీ లైఫ్ పార్టనర్‌కు ముందుగానే ఇన్‌ఫార్మ్ చేస్తారా? అన్న ప్రశ్నకు.. ‘లేదు, నా ప్రొఫెషనల్ లైఫ్‌ను పర్సనల్ లైఫ్‌కు దూరంగా ఉంచుతాను. అతని వృత్తిపరమైన విషయాల్లో నా పర్మిషన్ ఎలాగైతే తీసుకోరో.. నా విషయంలో కూడా తను అలాగే ఉండాలని కోరుకుంటా’ అని చెప్పుకొచ్చింది.



Next Story

Most Viewed