అన్నీ చూసినా అర్థం కాదు.. బాయ్‌ఫ్రెండ్‌పై తాప్సీ కామెంట్

by  |
అన్నీ చూసినా అర్థం కాదు.. బాయ్‌ఫ్రెండ్‌పై తాప్సీ కామెంట్
X

దిశ, సినిమా : తాప్సీ నటించిన లేటెస్ట్ క్రైమ్ డ్రామా ‘హసీన్ దిల్‌రుబా’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ సక్సెస్‌తో జోష్‌లో ఉన్న ఢిల్లీ గర్ల్.. కొత్తగా ప్రొడక్షన్ బ్యానర్ కూడా స్టార్ట్ చేసింది. దీని ద్వారా ఫిల్మ్ ఫ్రెటర్నిటీతో సంబంధం లేని వ్యక్తులకు అవకాశం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథ్యూ బోయ్‌తో డేటింగ్‌లో ఉన్న భామ.. తను నటించిన సినిమాల్లో అతని ఫేవరెట్ ఫిల్మ్ ఏదంటే? ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది.

‘మథ్యూ.. నేను నటించిన సినిమాలన్నీ చూశాడు. కానీ అందులోని ఎమోషన్, డ్రమాటిక్ ట్రీట్‌మెంట్ తనకు అర్థం కాదు’ అని తెలిపింది. అయితే తల్లి నిర్మల్‌జీత్‌కు మాత్రం తన చిత్రాలన్నీ నచ్చుతాయని చెప్పింది. ఇక తాప్సీ ప్రొడక్షన్ హౌస్ లాంచ్ చేసినపుడు ‘నేను ఒక సినిమా ఫ్రీగా చేస్తాను. మీరు నన్ను బాలీవుడ్‌లో చూడాలనుకుంటే లైక్ చేయండి’ అంటూ మథ్యూ చేసిన కామెంట్ అందరి అటెన్షన్ క్యాచ్ చేసింది. ప్రజెంట్ తాప్సీ ‘శభాష్ మిథు, లూప్ లపేట, దొబారా, రష్మి రాకెట్’ వంటి సినిమాలతో బిజీగా ఉంది.



Next Story

Most Viewed