అందుకే షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది :తాప్సీ

by  |
tapsee pannu
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను ప్రతీ సినిమాను చాలెంజింగ్‌గా తీసుకుంటుంది. చాలెంజింగ్ పాత్రలనే ఎంచుకుని అందుకు తగినట్లుగా బాడీ, మైండ్‌‌ను సెట్ చేసుకునేందుకు కష్టపడుతుంది. ఈ క్రమంలోనే ‘రష్మి రాకెట్’ సినిమా కోసం తను ఎలాంటి కఠిన శిక్షణ పొందిందో తెలుపుతూ సోషల్ మీడియాలో చిన్న గ్లింప్స్ షేర్ చేసింది. ఈ సినిమాలో అథ్లెట్‌గా కనిపించబోతున్న తాప్సీ.. జిమ్‌లో, ట్రాక్‌లో రిగొరస్‌గా ప్రాక్టీస్ చేసిన వీడియో షేర్ చేయగా.. అభిమానులు ఆశ్చర్యానికి గురవడంతో పాటు సూపర్ మోటివేషనల్‌గా ఉందని చెప్తున్నారు.

కాగా తీవ్రమైన శిక్షణ కారణంగా మూడో రోజు కనీసం నడవలేకపోయానని, దీంతో షూటింగ్ కూడా ఆపేయాల్సి వచ్చిందని తెలిపింది. ట్రైనింగ్ ప్రారంభ రోజుల్లో చాలా కష్టంగా అనిపించినా.. తను చేసే పాత్రకు పూర్తిగా న్యాయం చేసేందుకు కఠినమైన శిక్షణ పూర్తి చేసినట్లు తెలిపింది. కాగా ఈ వీడియో అభిమానుల్లో ఆసక్తి కలిగిస్తే తాను సక్సెస్ అయినట్లేనన్న తాప్సీ.. నెక్స్ట్ వీడియోలో పూర్తి ప్రయాణాన్ని చూపిస్తానని చెప్పింది. ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహించిన సినిమాను రోనీ స్క్రూవాలా నిర్మిస్తుండగా.. అభిషేక్ బెనర్జీ, ప్రియాన్షు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.



Next Story

Most Viewed