‘మిషన్ ఇంపాజిబుల్’ మరో తెలుగు ప్రాజెక్ట్‌లో తాప్సీ

by  |
Taapsee-Pannu
X

దిశ, సినిమా : ‘హసీన్ దిల్‌రుబా’ ద్వారా సూపర్ డూపర్ హిట్ అందుకున్న బ్యూటిఫుల్ తాప్సీ.. నాలుగేళ్ల తర్వాత మరో టాలీవుడ్ ప్రాజెక్ట్ చేస్తోంది. 2017లో చివరగా ‘ఆనందో బ్రహ్మ’ సినిమాలో తెలుగు తెరపై కనిపించిన భామ.. ప్రస్తుతం ‘మిషన్ ఇంపాజిబుల్’ టీమ్‌తో జాయిన్ అయింది. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు డైరెక్టర్ స్వరూప్ ఆర్‌ఎస్‌జె దర్శకులు కాగా.. షూటింగ్ స్పాట్‌లో తాప్సీకి గ్రాండ్‌ వెల్‌కమ్ చెప్పింది మూవీ యూనిట్.

చేతికి కట్టుతో లాప్‌టాప్‌ను నిశితంగా చూస్తున్న తాప్సీ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా మాట్లాడిన తాప్సీ.. గత ఏడేళ్లుగా ప్రేక్షకులుగానే తనను తాను చూసుకోవాలనుకునే కథల్లో భాగం అవుతున్నట్లు తెలిపింది. ఇందుకోసం తన సమయం, డబ్బు ఖర్చు చేసినట్లు వివరించింది. ‘మిషన్ ఇంపాజిబుల్’ కూడా అలాంటి చిత్రాల్లో ఒకటని, సినిమా కథ ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటుందని చెబుతూ.. ఈ చిత్రంలో భాగం కావడం ద్వారా క్వాలిటీ చిత్రాలను ఎంచుకుంటుందన్న ప్రేక్షకుల నమ్మకాన్ని మరోసారి నిలబెట్టగలిగానని చెప్పింది. కాగా మార్క్ కె రాబిన్ సంగీతం సమకూరుస్తున్న సినిమాను నిరంజన్‌ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Next Story

Most Viewed