తాప్సీ ‘అవుట్‌సైడర్స్ ఫిల్మ్స్’.. కంగనను కాపీ కొడతోందా?

by  |
tapsee-and-kangana
X

దిశ, సినిమా : బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్న హీరోయిన్ తాప్సీ.. మరో మైల్‌స్టోన్ సెట్ చేసింది. దాదాపు పదేళ్లకుపైగా సినిమా కెరియర్ కలిగిన భామ.. ఓన్ ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించింది. కంటెంట్ క్రియేటర్ అండ్ ప్రొడ్యూసర్‌ ప్రాంజల్‌తో కలిసి ‘అవుట్‌సైడర్స్ ఫిల్మ్స్’ లాంచ్ చేసింది. సినిమా పట్ల తనకున్న ప్రేమను చాటుకునేందుకు న్యూ జర్నీ స్టార్ట్ చేయడం సంతోషంగా ఉందని చెబుతూ.. తనలాగే బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి రావాలనుకునే టాలెంటెడ్ ఆర్టిస్టులను ప్రోత్సహించడమే తన ఉద్దేశమని వివరించింది. న్యూ అండ్ ఫ్రెష్ టాలెంట్ కోసం ‘అవుట్‌సైడర్స్ ఫిల్మ్స్’ డోర్స్ ఎప్పుడూ తెరిచే ఉంటాయన్న తాప్సీ.. థ్రిల్లర్ జోనర్‌లో వస్తున్న తమ ఫస్ట్ ప్రాజెక్ట్ ‘బ్లర్’ టైటిల్ పోస్టర్ షేర్ చేసింది. అజయ్ భల్, పవన్ సోనీ దర్శకత్వంలో వస్తున్న సినిమాను జీస్టూడియోస్‌, ఎకలోన్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తోంది.

అయితే ఎప్పుడూ కంగనా రనౌత్‌ను ఫాలో అవుతుందని విమర్శలు ఎదుర్కొనే తాప్సీ ఈసారి కూడా అలాంటి ట్రోలింగ్స్ ఎక్స్‌పీరియన్స్ చేయాల్సి వచ్చింది. కంగన ‘మణికర్ణిక ఫిల్మ్స్’ లాంచ్ చేసిన కొద్దిరోజులకే తాను కూడా ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేయడం కాపీలాగే ఉందని కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed