టీమిండియా, SRH బౌలర్ నటరాజన్ కీలక నిర్ణయం.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

by  |
టీమిండియా, SRH బౌలర్ నటరాజన్ కీలక నిర్ణయం.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ
X

దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియా పేస్ బౌలర్, యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పాడు. జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసి ఏడాది కావొస్తున్న సందర్భంగా తాను ఓ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపాడు. తన సొంత ఊరిలో అన్ని వసతులతో కూడిన క్రికెట్ గ్రౌండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేశాడు.

టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లలో తాను ఆడటం ఆనందంగా ఉందన్న నట్టు.. తన సొంత ఊరిలో గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపాడు. ఆ గ్రౌండ్‌కు నటరాజన్​ క్రికెట్ గ్రౌండ్ అని పేరును ఖరారు చేశాడు. ఈ సందర్బంగా సొంత ఊరిలో అన్ని సౌకర్యాలు ఉండేలా క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నాడు. గతేడాది డిసెంబర్‌లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేశా. ఈ ఏడాది డిసెంబర్‌లో మైదానం కడుతున్నా అని ట్విట్టర్ పోస్ట్‌లో తెలిపాడు. అయితే ఐపీఎల్‌లో నటరాజన్ సన్​రైజర్స్ జట్టులో కీ బౌలర్. నటరాజన్​ అనేకసార్లు మెయిన్ బ్యాట్స్‌మెన్ వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ ప్రదర్శన కారణంగానే నట్టు జాతీయ జట్టులోకి అరగ్రేటం చేసిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed