కీలక ఒప్పందం.. రైతులకు బీమా, ఉత్పాదనలపై సలహాలు

by Shyam |   (  Updated:2021-09-23 23:02:49  IST  )

<p>దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యవసాయ అనుబంధ రంగాలపైనే అధికంగా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. 70శాతం మంది చిన్న, సన్నకారులు రైతులే. రైతులు పాతపద్దతులనే అవలంభిస్తుండటంతో ఇబ్బందులకు గురవుతున్నారు. వారిని అధునాతన సాంకేతికతవైపు పయనించేలా, లాభసాటి పంటలను పండించేలా ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే గురువారం ఎస్ఆర్ఐ ఇంటర్నేషనల్ (స్టాన్ ఫోర్డ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) మూలాలు కలిగిన ఇన్సూర్ టెక్ వెంచర్ వింగ్ స్యూర్ తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన [&hellip;]</p>

కీలక ఒప్పందం.. రైతులకు బీమా, ఉత్పాదనలపై సలహాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యవసాయ అనుబంధ రంగాలపైనే అధికంగా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. 70శాతం మంది చిన్న, సన్నకారులు రైతులే. రైతులు పాతపద్దతులనే అవలంభిస్తుండటంతో ఇబ్బందులకు గురవుతున్నారు. వారిని అధునాతన సాంకేతికతవైపు పయనించేలా, లాభసాటి పంటలను పండించేలా ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే గురువారం ఎస్ఆర్ఐ ఇంటర్నేషనల్ (స్టాన్ ఫోర్డ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) మూలాలు కలిగిన ఇన్సూర్ టెక్ వెంచర్ వింగ్ స్యూర్ తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వింగ్ స్యూర్ సంస్థ పంట బీమా, ఉత్పాదనలు, సలహా, సేవలను చిన్న రైతులకు అందించనుంది. రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ (ఐటీఈ అండ్ సీ) ఈ పరిష్కారాన్ని అమలు చేసేందుకు బాధ్యత వహించనుంది. వ్యవసాయ విభాగం దీన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయనుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ పరిశోధన కేంద్రాలు ఆయా పంటలకు, శీతోష్ణస్థితి పరిస్థితులకు సంబంధించి సలహాలు, సూచనలను వింగ్ స్యూర్ వేదిక అందజేస్తారు.

పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందన్నారు. వ్యవసాయరంగంలో సాంకేతికతను వర్తింపజేసి లాభసాటిగా మార్చేందుకు చేస్తున్న కృషిలో భాగంగా వింగ్ స్యూర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. రైతులకు సాగులో అనుసరించాల్సిన యాజమాన్య పద్దతులు, దిగుబడి తదితర అంశాలను వివరించడం జరుగుతుందన్నారు.

వింగ్ స్యూర్ వ్యవస్థాపకుడు, సీఈఓ అవిబసు మాట్లాడుతూ రైతులు సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయసాగులో అధికదిగుబడులు సాధించేలా కృషిచేస్తామన్నారు. వర్ధమాన సాంకేతికతను జోడించి రైతులు లాభసాటి పంటలు వేసేలా ప్రోత్సహిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా రైతులను కాపాడేందుకు కృత్రిమ మేధ, డీప్ టెక్నాలజీలను వినియోగిస్తోందని, వర్ధమాన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల్లో కంపెనీ తన కార్యకలాపాలను నిర్వహిస్తోందని పేర్కొన్నారు. సంప్రదాయక ఆర్థిక సేవలకే పరిమితమైన వారికి కొత్త అవకాశాలను అందించడంపై దృష్టి సారించిందని, రైతుల సుస్థిరదాయకతలను నిర్వహించేందుకు సాంకేతికతను, భద్రతను అందజేస్తామన్నారు.

Next Story