చేతిలో కత్తి.. మద్యం మత్తులో రోడ్డుపై…

by  |
చేతిలో కత్తి.. మద్యం మత్తులో రోడ్డుపై…
X

దిశ, సికింద్రాబాద్: తాగిన మత్తులో ఓ వ్యక్తి రోడ్డుపై హల్‌చల్ చేసి వారించినందుకు కత్తితో చేయి కోసుకున్న సంఘటన సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… చిలకలగూడ పిట్టల బస్తీలో నివాముండే శంకురేష్(23) అనే వ్యక్తి పండ్ల వ్యాపారం చేసి జీవిస్తున్నాడు. గత కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. కాగా మంగళవారం మధ్యాహ్నం మద్యం తాగిన అతడు చిలకలగూడ చౌరస్తాకు వచ్చి రోడ్డుపై వాహనాలకు అడ్డంగా వెళుతూ హల్‌చల్ చేశాడు.

ఇదేమని అడిగిన వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ చేతిలో ఉన్న పండ్లు కోసే కత్తితో తన చేతిని కోసుకున్నాడు. చేతికి గాయమై తీవ్రంగా రక్తం కారుతుండగా కిందపడిపోయాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శంకురేష్ చేతికి ప్రథమ చికిత్స నిర్వహించి అనంతరం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిలకలగూడపోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed