పెద్దేముల్‌లో అనుమానాస్పదంగా పేలుడు

by Shyam |

<p>దిశ, తాండూరు: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ గ్రామానికి చెందిన భ్యాగరి యాదప్ప ఇంటి ముందున్న బండ ఒక్కసారిగా పేలింది. దీంతో అక్కడే ఉన్న యాదప్ప తనయుడు వెంకట్‌(19)కు తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు శబ్ధానికి కంగారు పడిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే బయటకువచ్చి చూడగా.. వెంకట్ తీవ్రగాయాలతో పడిపోయి ఉన్నాడు. వెంటనే క్షతగాత్రుడిని [&hellip;]</p>

Severe injuries
X

దిశ, తాండూరు: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ గ్రామానికి చెందిన భ్యాగరి యాదప్ప ఇంటి ముందున్న బండ ఒక్కసారిగా పేలింది. దీంతో అక్కడే ఉన్న యాదప్ప తనయుడు వెంకట్‌(19)కు తీవ్ర గాయాలయ్యాయి.

Police

పేలుడు శబ్ధానికి కంగారు పడిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే బయటకువచ్చి చూడగా.. వెంకట్ తీవ్రగాయాలతో పడిపోయి ఉన్నాడు. వెంటనే క్షతగాత్రుడిని తాండూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పేలుడు సమాచారం అందుకున్న డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ జలంధర్ రెడ్డి, ఎస్సై గఫర్ ఘటన స్థలానికి చేరుకున్నారు. పరిసరాలను పరిశీలించారు. పేలుడు ఎలా సంభవించిందో స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కాగా, ఈ పేలడుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story