దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కట్టంగూరు మండలం మల్లారం గ్రామ శివారులో మండల కేంద్రానికి చెందిన ఫొటో గ్రాఫర్ మేకల హరికృష్ణ(23) అనుమానస్పదంగా మృతిచెందాడు. మల్లారం గ్రామ శివారులో ఎస్‌ఎల్‌బీసీ కాలువ పక్కన ఉన్న వ్యవసాయ పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గమనించిన స్థానికులు మృత్తిడి అన్న మేకల హరిబాబుకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఫొటో గ్రాఫర్ అనుమానస్పద మృతి
గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబర్ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..