- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి..
<p>దిశ, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం లోని లింగాపూర్ లో పదహారేళ్ల కుమ్మరి పుష్పలత అనే విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈమె ప్రస్తుతం శ్రీనివాస జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆదివారం రాత్రి చాకలి పండరి అనే యువకుడి తో మాట్లాడుతోందని ఆమె తండ్రి మందలించాడు. దీంతో రాత్రి కి ఆమె ఇంటికి రాలేదు. కనిపించకుండా పోయిన పుష్పలత లింగాపూర్ గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని కనిపించిందని స్థానికులు తెలిపారు. అయితే […]</p>

X
దిశ, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం లోని లింగాపూర్ లో పదహారేళ్ల కుమ్మరి పుష్పలత అనే విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈమె ప్రస్తుతం శ్రీనివాస జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆదివారం రాత్రి చాకలి పండరి అనే యువకుడి తో మాట్లాడుతోందని ఆమె తండ్రి మందలించాడు. దీంతో రాత్రి కి ఆమె ఇంటికి రాలేదు. కనిపించకుండా పోయిన పుష్పలత లింగాపూర్ గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని కనిపించిందని స్థానికులు తెలిపారు. అయితే పుష్పలత ను హత్య చేసి, ఉరేసుకున్నట్టు చిత్రీకరించారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. చాకలి పండరి పై వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు నారాయణఖేడ్ ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు.

Next Story






